Sri Shirdi Sai Baba Chalisa Lyrics, PDF & Song Download

Sri Shirdi Sai Baba Chalisa Lyrics – Download PDF and Song

Sri Shirdi Sai Baba Chalisa Lyrics English

Shirdivasa Sai Prabho Jagatiki Mulam Nive Prabho
Datta Digambara Avataram Nilo Srishti Vyavaharam.

Trimurtirupa O Sai Karuninchi Kapadoyi
Darshanamiyya Garavayya Muktiki Margam Chupumaya.

Shirdivasa Sai Prabho.

Kaphini Vastramu Dhariyinchi Bhujamuku Joli Tagilinchi
Nimba Vrkshapu Chayalo Fakiru Veshapu Dharanalo
Kaliyugamanduna Velasitivi Tyagam Sahanam Nerpitivi
Shirdi Gramam Ni Vaasam Bhaktula Madilo Ni Rupam.

Shirdivasa Sai Prabho.

Chand Patil Nu Kalusukuni Atani Badhalu Telusukuni
Gurramu Jada Telipitivi Patil Badhanu Tirchitivi
Veliginchavu Jyotulanu Nivupayoginchi Jalamulanu
Achcheruvondenu A Gramam Chusi Vintaina A Drshyam.

Shirdivasa Sai Prabho.

Bayija Chesenu Ni Seva Pratiphalamichchavo Deva
Ni Ayuvunu Badulichchi Tatyanunu Nivu Bratikinchi
Pasupakshulanu Preminchi Premato Vatini Lalinchi
Jivulapaina Mamakaram Chitramaya Ni Vyavaharam.

Shirdivasa Sai Prabho.

Ni Dvaramulo Nilichitini Ninne Nityamu Kolichitini
Abhayamunichchi Brovumaya O Shiridisha Dayamaya
Dhanyamu Dwaraka O Mayi Nilo Nilichenu Sri Sai
Ni Dhuni Mantala Vedimiki Papamu Povunu Takidiki.

Shirdivasa Sai Prabho.

Pralaya Kalamu Apitivi Bhaktulanu Nivu Brochitivi
Chesi Mahammari Nasham Kapadi Shirdi Gramam
Agnihotri Shastriki Lila Mahatmyam Chupinchi
Shyamaanu Bratikinchitivi Pamu Vishamu Toliginchi.

Shirdivasa Sai Prabho.

Bhakta Bhimajiki Kshayarogam Nashiyinche Atani Sahanam
Udi Vaidyam Chesavu Vyadhini Mayam Chesavu
Kakajiki O Sai Vittala Darshanam Ichchitivi
Damukichchi Santanam Kaliginchitivi Santosham.

Shirdivasa Sai Prabho.

Karunasindhu Karuninchu Mapai Karuna Kuripinchu
Sarvam Nike Arpitamu Penchumu Bhakti Bhavamunu
Muslim Anukoni Ninu Meghu Telusukuni Atani Badha
Dalchi Shivashankara Rupam Ichchavayya Darshanamu.

Shirdivasa Sai Prabho.

Daktaruku Nivu Ramuniga Balvantaku Sridattuniga
Nimonukaraku Marutiga Chidambaraku Sri Ganapatiga
Martandaku Khandobaga Ganuku Satyadevuniga
Narasimhaswamiga Joshiki Darshanamu Nichchina Sri Sai.

Shirdivasa Sai Prabho.

Reyi Pagalu Ni Dhyanam Nityam Ni Lila Pathanam
Bhaktito Cheyandi Dhyanam Labhinchunu Muktiki Margam
Padakondu Ni Vachanalu Baba Makavi Vedalu
Sharanani Vachchina Bhaktulanu Karuninchi Nivu Brochitivi.

Shirdivasa Sai Prabho.

Andarilona Ni Rupam Ni Mahima Ati Shaktimayam
O Sai Memu Mudhulamu Osagumaya Maku Jnanamunu
Srishtiki Nivenaya Mulam Sai Memu Sevakulam
Sai Namamu Talachedamu Nityamu Saini Kolichedamu.

Shirdivasa Sai Prabho.

Bhakti Bhavana Telusukoni Saini Madilo Nilupukoni
Chittamuto Sai Dhyanam Cheyandi Pratinityam
Baba Kalchina Dhuni Udi Nivarinchunu Adi Vyadhi
Samadhi Nundi Sri Sai Bhaktulanu Kapadeno.

Shirdivasa Sai Prabho.

Mana Prashnalaku Javabulu Telupunu Sai Charitamulu
Vinandi Leka Chadavandi Sai Satyamu Chudandi
Satsangamunu Cheyandi Sai Swapnamu Pondandi
Bheda Bhavamunu Manandi Sai Mana Sadguruvandi.

Shirdivasa Sai Prabho.

Vandanamayya Paramesha Apadbhandhava Saiisha
Ma Papamulu Kadaterchu Ma Madi Korika Neraverchu
Karunamurti O Sai Karunato Mamu Darichero
Ma Manase Ni Mandiramu Ma Palukule Niku Naivedyam.

Shirdivasa Sai Prabho.

Akhilandakoti Brahmandanayaka
Rajadhiraja Yogiraja Parabrahma
Sri Sachchidananda Sadguru Sainath Maharaj Ki Jai.

Sri Shirdi Sai Baba Chalisa Lyrics Telugu

షిర్డివాస సాయి ప్రభో.

జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం.

త్రిమూర్తిరూపా ఓ సాయి కరుణించి కాపాడోయి
దర్శనమియ్య గరవయ్య ముక్తికి మార్గం చూపుమాయ.

షిర్డివాస సాయి ప్రభో.

కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిర్డీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం.

షిర్డివాస సాయి ప్రభో.

చాంద్ పాటిల్ ను కలుపుకుని అతని బాధలు తెలుసుకుని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నివుపయోగించి జలములను
అచ్చెరువొండెను ఒక గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం.

షిర్డివాస సాయి ప్రభో.

బాయిజ చేసేను నీ సేవ ప్రతిఫలమిచ్చవో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయ ని వ్యవహారం.

షిర్డివాస సాయి ప్రభో.

నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమాయా ఓ శిరిడీశ దయామయా
ధాన్యము ద్వారకా ఓ మయి నీలో నిలిచెను శ్రీ సాయి
నీ ధుని మంటల విడిమికి పాపము పోవును తాకిడికి.

షిర్డివాస సాయి ప్రభో.

ప్రళయ కాలము అపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరి నాశం కాపాడి షిర్డీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలిగించి.

షిర్డివాస సాయి ప్రభో.

భక్త భీమాజికి క్షయరోగం నశియించే అతని సహనం
ఊది వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజికి ఓ సాయి విఠల దర్శనం ఇచ్చితివి
దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం.

షిర్డివాస సాయి ప్రభో.

కరుణాసింధు కరుణించు మాపై కరుణ కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచు భక్తి భావమును
ముస్లిం అనుకోని నిను మేఘు తెలుసుకుని అతని బాధ
దాల్చి శివశంకర రూపము ఇచ్చవయ్య దర్శనము.

షిర్డివాస సాయి ప్రభో.

డాక్టరుకు నీవు రామునిగా బలవంతకు శ్రీదత్తునిగా
నిమోనుకారకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా
మార్తాండకు ఖండోబాగ గనుకు సత్యదేవునిగ
నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీ సాయి.

షిర్డివాస సాయి ప్రభో.

రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీల పఠనం
భక్తితో చేయండీ ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి.

షిర్డివాస సాయి ప్రభో.

అందరిలోనా నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము ముద్దులము ఒసగుమయ మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనాయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము.

షిర్డివాస సాయి ప్రభో.

భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయి ధ్యానం చేయండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊదీ తగ్గించును ఆది వ్యాధి
సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడెనో.

షిర్డివాస సాయి ప్రభో.

మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండీ సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి.

షిర్డివాస సాయి ప్రభో.

వందనమయ్య పరమేశా ఆపద్భాంధవ సాయిషా
మా పాపములు కడతేర్చు మా మది కోరిక నేరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేరో
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం.

షిర్డివాస సాయి ప్రభో.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

ALSO READPanchamukha Hanuman Kavacham

Hi, My name is Varma

Leave a Comment